skip to main |
skip to sidebar
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
- అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
- అగ్నికి వాయువు తోడైనట్లు
- అడకత్తెరలో పోకచెక్క
- అడగందే అమ్మ అయినా పెట్టదు
- అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
- అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
- అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
- అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
- అడుసు తొక్కనేల కాలు కడగనేల
- అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
- అతడికంటె ఘనుడు అచంట మల్లన్న
- అతి వినయం ధూర్త లక్షణం
- అత్త సొమ్ము అల్లుడు దానం
- అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
- అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
- అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
- అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
- అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
- అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
- అనగా అనగా రాగం తినగా తినగా రోగం
- అనుమానం పెనుభూతం
- అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
- అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
- అన్నిదానాలలోకి నిదానమే గొప్పదన్నాట్ట!!
- అన్ని ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది.ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- అప్పిచ్చువాడు వైద్యుడు
- అప్పు నిప్పులాంటిది...
- అప్పుచేసి పప్పు కూడు
- అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
- అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
- అభ్యాసము కూసు విద్య
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిన నివ్వదు
- అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
- అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
- అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
- అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
- అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
- అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
- అరిచే కుక్క కరవదు
- అర్దరాత్రి మద్దెల దరువు
- అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
- అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
- అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
- అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
0 comments:
Post a Comment